గంజాయి తరలిస్తున్న మహిళ అరెస్ట్
పెద్దపల్లి,(విజయక్రాంతి): గంజాయి తరలిస్తున్న మహిళాను అరెస్ట్ చేసినుట్లు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. సోమవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. గోదావరిఖని చెందిన ఆరె భాగ్యవతి అనే మహిళా సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గత ఆరు నెలల నుంచి నాగపూర్ రైల్వే స్టేషన్ నుంచి గంజాయిని తక్కువ ధరకు కొని, గోదావరిఖని పరిసర ప్రాంతంలో ఎక్కువ ధరకు అమ్ముతుంది.
ఈనెల 6న నాగపూర్ రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ ఫోన్ ద్వారా పరిచయం అయిన గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి గంజాయిని కొని దానిని ఎవరికీ అనుమానం రాకుండా బ్యాగ్‌లో పెట్టుకొని 7న పెద్దపల్లి స్టేషన్ లో దిగి నడుచుకుంటూ వస్తుండగా పెద్దపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పెట్రోలింగ్ చేస్తున్న పోలిసులను చూసి పరిగెత్తగా ఆమెను పట్టుకొగా, ఆమె వద్ద ఉన్న: సుమారు రెండు లక్షల విలువ గల 4.05 కేజీల ఎండు గంజాయి, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితురాలుని చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐలు.లక్ష్మణ్ రావు, నరేష్, ఏఎస్ఐ ఆంజనేయ రావు, కానిస్టేబుల్ సతీష్, మహిళా కానిస్టేబుల్ శ్రీలతను అభినందించి, రివార్డ్ ఇవ్వటం జరిగిందని తెలిపారు.






