ఏటీఎంలో చోరీ కాదు.. ఏటీఎమే చోరీ
ఆరు నిమిషాల లోపు ఏటీఎం తరలింపు
పక్క ప్రణాళికతో అంతర్రాష్ట్ర మూట స్కెచ్
నగరం నడి మధ్యలో జరిగిన దోపిడీ ఘటన
మహబూబ్ నగర్ క్రైం, మే 26 : ఏటీఎంలో చోరీ జరగడం మనం అక్కడక్కడ వింటుంటాం. కాగా మహబూబ్ నగరం నడి మధ్యలో తెలంగాణ చౌరస్తా సమీపంలో ఏటీఎంలో చోరీ కాదు ఏటీఎం చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. సీఐ ఎజాజ్ జోద్దీన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ చివరస్తల్ సమీపంలోని ఎస్బిఐ ఎటిఎం పై అంతర్రాష్ట్ర దుండగులు రెక్కి నిర్వహించారు.
పక్కనే ఉన్న గల్లీలో వాహనాన్ని తెలిపి పక్క ప్లానింగ్ తో అక్కడ ఉన్న సీసీ కెమెరాలు తీగలను కట్ చేసి ఐదు నుంచి ఆరు నిమిషాల వ్యవధిలో ఏటీఎంను వాహనంలోకి ఎక్కించారు. నగరం సమీపంలోని బోయపల్లి గేటు ప్రాంతంలో ఏటీఎం లోని క్యాష్ ఉండే ప్రాంతంలో గ్యాస్ కట్టర్ తో కట్ చేసి అందులో ఉన్న రూ 2 లక్షల 35వేల 500 లను ఎత్తుకెళ్లారు.
ఈ దోపిడికి సంబంధించి ముగ్గురు వ్యక్తులు అంతర్రాష్ట్ర దుండగులుగా గుర్తించినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని త్వరలోనే దుండగులను పట్టుకుంటామని పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ డి జానకి ప్రత్యేకంగా సందర్శించి కేసును త్వరగా చేదిస్తామని పేర్కొన్నారు.
నగరం నడి మధ్యలో గిట్ల అయితే ఎట్లా?
నిరంతరం తిరిగే ప్రాంతమైన నగరంలోని తెలంగాణ చౌరస్తా ప్రాంతంలో ఎస్బిఐ ఎటిఎం తరలింపు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నగరం లో ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రాత్రి పగలు భేదం లేకుండా కూడా రైల్వే స్టేషన్ తో పాటు ఆస్పత్రులు తదితర ప్రాంతాలకు ఈ ప్రాంతం మీదుగా జనం తిరుగుతూ ఉంటారు.
ఇలాంటి రద్దీ ప్రాంతంలో కూడా ఏటీఎం మే దోపిడీకి గురి అయింది అంటే మారుమూల ప్రాంతంలో ఉన్న ఇతర సముదాయాల పరిస్థితి ఏంటని నగరవాసులు భయాందోళనలకు గురి అవుతుండ్రు. పోలీస్ నిగా మరింతగా పెంచాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని ప్రజలు కోరుతుండ్రు.






