కవాడిగూడలో మహిళ దారుణ హత్య
అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భర్త
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ముషీరాబాద్, మే 19 (విజయక్రాంతి): ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో భర్త వెంటాడి అతి కిరాతకంగా కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడ మెయిన్ రోడ్‌లో ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ నాలుగో అంతస్తులో కొనసాగుతున్న ఓ సెలూన్, స్పా సెంటర్‌లో మంగళవారం జరిగింది.
అత్తాపూర్ పీఎస్ పరిధిలోలోని కిషన్‌బాగ్ ఎంఎన్ గూడెం కాలనీలో నివాసముండే ఎం. లలితకు ఆరుగురు కుమార్తెలు, నాలుగో కుమార్తె అయినా బంగి దెబోర అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బంగి రాజును వృత్తిరీత్యా ఆటో ట్యాక్సీ డ్రైవర్ 2018లో ప్రేమ వివాహం చేసుకుంది. ఇదే ప్రాంతంలో బంగి దేబోరా కుటుంబ సభ్యులు, రాజు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంత కాలం తర్వాత కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.
అయితే బంగి దేబోరా కవాడిగూడ మెయిన్‌రోడ్‌లోని ఓ సెలూన్ స్పా సెంటర్లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ ఇద్దరు వారి వారి తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో గత సంవత్సర క్రితం అత్తాపూర్ పిఎస్ లో తన భర్త రాజు వేధిస్తున్నాడని బంగి దెబోరా ఫిర్యాదు చేయడంతో పాటు, విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది.
దీంతో కసి పెంచుకున్న రాజు భార్య దేబోరాను వెంబడించాడు. స్పాసెంటర్ లిఫ్ట్‌లో వెళుతుండగా గొడవకు దిగాడు. నాలుగో ఫ్లోర్‌లో వెంటతెచ్చుకున్న కత్తితో భార్యపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. సంఘటనా స్థలంలోనే దేబోరా రక్తం మడుగులో కుప్పకూలిపోయింది. రాజు నేరుగా అత్తాపూర్ పీఎస్‌లో లొంగిపోయాడు. దేబోరా తల్లి లలిత ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.






