27 June, 2026 | 7:31 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

అంబులెన్స్‌లోనే మహిళ సుఖ ప్రసవం

05-05-2026 12:49 AM

అయిజ, మే 4: అయిజ మండలంలోని తుంకుంట గ్రామానికి చెందిన మహిళ 108 లో సిబ్బంది సహకారంతో అంబులెన్సు లోనే సుఖ ప్రసవం జరిగిందని ఏమర్జెన్స్ టెక్నీషన్ ఇశ్రాయిలు తెలిపారు. వివరాలలోకి వెళితే అయిజ మండలం లోని తుంకుంట గ్రామం నుండి పురిటి నొప్పులతో బాధపడుతున్న కీర్తన ఇంటినుండి 108 కి చరవాణి ద్వారా సమాచారం రావడంతో సమాచారం అందుకున్న అయిజ సిబ్బంది తూంకుంటకు వెళ్లి గర్భిణీ స్త్రీ నీ అంబులెన్సులో తీసుకొని వస్తుండగా మార్గ మధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడం జరిగిందని అన్నారు.

ఇది గ్రహించిన సిబ్బంది టెక్నీషన్ ఇశ్రాయేలు, శ్రీధర్ లు వెంటవచ్చిన మహిళల సహకారంతో పురుడు పోయాగ కీర్తన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని సిబ్బంది తెలిపారు. అనంతరం స్థానిక అయిజ పి హెచ్ సి కి తరలించి చేర్పించగా డాక్టర్లు తల్లి బిడ్డ క్షేమం గా ఉన్నారని తెలుపడంతో  బంధువులు గ్రామస్తులు ఆనందం తో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సిబ్బందికి కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.