5 May, 2026 | 2:58 AM

అలంపూర్ చౌరస్తాలో ప్రజావాణికి ఆదరణ

05-05-2026 12:47 AM

అలంపూర్ మే 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో మొదటి సారిగా అమలు చేస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి ఆదరణ లభిస్తుంది.అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్డిఓ శ్రీనివాసరావు సమక్షంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఉండవల్లి ,అలంపూర్ ,మానవపాడు మండలాలకు చెందిన వివిధ గ్రామాల ప్రజలు తమ దరఖాస్తులతో తరలివచ్చి ప్రజావాణిలో అర్జీలు సమర్పించారు.

ఇందిరమ్మ ఇల్లు మంజూరు, భూ సమస్యలపై మొక్కజొన్న కొనుగోలు చేసిన దాన్యం తరలించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలు సమస్యలపై అర్జీలు సమర్పించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను ఆన్లైన్లో నమోదు చేసి అర్జీలకు రసీదులు అందజేశారు.30 రోజుల్లో మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనిఆర్డీవో శ్రీనివాసరావు అర్జీదారులకు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.