వడదెబ్బతో మహిళ మృతి.. కోనరావుపేటలో విషాదం
09-05-2026 07:16 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారినపడి ఓ మహిళ మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కోలకాని బుధవ్వ (68) తీవ్ర ఎండలో పనులకు వెళ్లగా అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు చికిత్స చేయించగా పరిస్థితి విషమించి ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి కుమారుడు నాగరాజు, కుమార్తె ఉన్నారు. అధికారులు ప్రజలు అవసరం లేకుండా ఎండలో తిరగవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.






