సమగ్ర అభివృద్ధికే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
మహబూబాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హు లందరికీ అమలు చేయడం, గ్రామ, వార్డు సభల నిర్వహణతో సమస్యల గుర్తింపు కోసమే ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని జిల్లా ప్రత్యే క అధికారి, జెన్కో సీ ఎం డీ డాక్టర్ ఎస్. హరీష్ తెలిపారు. కలెక్టరేట్లో 99 రోజుల కా ర్యాచరణ ప్రణాళికపై జిల్లా స్థాయి సమీక్ష ని ర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్నే హ శబరిష్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా గ్రామ, వార్డు సభల నిర్వహణతో కిందిస్థాయి నుంచి కూడా ప్రజల సమస్యల ను గుర్తించడమే కాక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులు గురించి ఆయా శాఖల అధికారులు వివరించడం జరిగిందన్నారు.
వివిధ శాఖల్లో గుర్తించిన సమ స్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని సంబంధిత అధికా రులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ ప థకాల అమలును నిరంతర ప్రక్రియగా పే ర్కొంటూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని సూచించా రు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం దరఖాస్తు చేసుకున్న ధరఖాస్తులను పరిశీలించి సంబందిత శాఖలకు పరిష్కారానికి పంపించామన్నారు. అ న్యాక్రాంత ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు.






