11 August, 2026 | 1:14 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

కదులుతున్న బస్సులో మహిళపై లైంగిక దాడి

31-07-2024 12:20 AM

ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిపై బస్సు డ్రైవర్ ఘాతుకం

డయల్ 100కి ఫిర్యాదు చేసిన బాధితురాలు

బస్సును ట్రేస్ చేసి ఒక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): నగరంలో ‘నిర్భయ’ తరహా ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో మహిళపై లైంగిక దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సులో మంగళవారం ఓ మహిళ నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తోంది. ఈ బస్సులో కృష్ణ, సిద్ధయ్య అనే ఇద్దరు డ్రైవర్లుగా ఉన్నారు. బస్సులో వేరే ప్రయాణికులు లేకపోవడంతో ఇదే అదనుగా భావించిన డ్రైవర్లు బస్సు అద్దాలను క్లోజ్ చేశారు.

సిద్ధయ్య బస్సు నడుపుతుండగా మేడ్చల్ సమీపంలోకి రాగానే మరో డ్రైవర్ కృష్ణ.. మహిళ నోట్లో గుడ్డలు కుక్కి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర భయభ్రాంతులకు గురైన బాధితురాలు దిక్కుతోచని స్థితిలో 100 నంబర్‌కు ఫోన్ చేసి తనపై జరిగిన అఘాయిత్యం గురించి సిటీ పోలీసులకు సమాచారమందించి, రక్షించాలని ప్రాధేయప డింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిటీ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా బస్సును ట్రేస్ చేసి ఉస్మానియా యూనివ ర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు. ప్రస్తుతం సిద్ధయ్యను అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో డ్రైవర్ కృష్ణ పరారయ్యాడని, అతని కోసం గాలిస్తు న్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఓయూ పీఎస్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు.