స్త్రీ శిశు సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మహబూబాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమా నికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఘనపూర్ మండలం మైలారం గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు, అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన నివాస సౌకర్యాలు, చిన్నారుల సంరక్షణ, పోషణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అంగన్వాడీ భవనం ద్వారా గ్రామంలోని చిన్నారులు, గర్భిణీ స్త్రీలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ భూక్య సమ్మయ్య, మాజీ జెడ్పీటీసీ ముత్యాల రాజయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.




