20 March, 2026 | 4:33 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

గొంగడి త్రిషను అభినందించిన సీఎం... రూ. కోటి నజరానా

05-02-2025 05:32 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): అండర్ -19 మహిళల T20 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిషను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఇటీవల మలేషియాలో జరిగిన మహిళ అండర్ -19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన త్రిష తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం ఆమెను శాలువాతో సత్కరించి, ప్రోత్సాహకంగా కోటి రూపాయలు నజరానా ప్రకటించారు.

భవిష్యత్తులో భారతదేశం తరఫున మరింతగా రాణించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. త్రిషకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించడంతో పాటు టీం సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి రూ.10 లక్షలు, టీం హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్ కి, ట్రైనర్ షాలినికి రూ.10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన త్రిష సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు  వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు,  తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన ఐవైసితో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు.