ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
డీసీసీ అధ్యక్షుడు కరుణాకర్‌కు రాఖీ కట్టిన మహిళా నేతలు
భూపాలపల్లి టౌన్,ఆగస్టు 28 (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ కు రాఖీ కట్టి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. మహిళల సమస్యల పరిష్కారంతో పాటు వారి గౌరవం, భద్రత, సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా పట్టణ అధ్యక్షురాలు మాలతి, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి, జిల్లా కార్యదర్శి కోమల, కో-ఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్ శారద, మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు కమల, మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి కమల, మహిళా కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






