28 August, 2026 | 3:03 PM

కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు

28-08-2026 02:30 PM

కోటపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలను శుక్ర వారం ఘనంగా నిర్వహించారు. వార్డెన్ భవాని ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆశ్రమ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమిరెల్లి మధునయ్యకు ఉపాధ్యాయులు, విద్యార్థులు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వార్డెన్ భవాని మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని విద్యార్థులకు వివరించారు. సోదరభావం, పరస్పర గౌరవం, ఆత్మీయతను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ఆనందోత్సాహాలతో రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు.