మాజీ ఎంపీ నామ కు రాఖీ కట్టిన సోదరి ధనమ్మ
28-08-2026 04:07 PM
ఖమ్మం, (విజయక్రాంతి): ఖమ్మం నెహ్రూనగర్‌లోని వరలక్ష్మి నిలయం నందు శుక్రవారం రక్షాబంధన్ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత(Former Leader of the RS Lok Sabha Party), ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుకు(Nama Nageswara Rao) ఆయన సోదరి ధనమ్మ రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సోదరి ధనమ్మ నామ నాగేశ్వరరావును ఆశీర్వదించి, మిఠాయి తినిపించారు. అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. రాఖీ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.






