మహిళా సర్పంచ్‌లు పేరుకే.. పెత్తనం భర్తలది!
- మహిళా సర్పంచులు సంతకం, ఫొటోలకే పరిమితం
- అధికచోట్ల మహిళా సర్పంచుల భర్తలదే నిర్ణయం ఫైనల్
- అన్నీ చూస్తూ అధికారులు మౌనం
- మహిళ వార్డు సభ్యుల పరిస్థితి అంతే
జడ్చర్ల, ఏప్రిల్ 13: సమాజంలో ఆడవారికి ప్రాధాన్యత కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వాలు వారికి అన్ని రంగాల్లో రిజర్వేషన్ లను అమలు చేస్తుంది. అందులో భాగంగానే రాజకీయాల్లోనూ వారికి రిజర్వేషన్ లను కల్పించింది. అయితే అమలు తీరులో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతున్న విషయం నేడు అందరికి తెలిసిందే.
పోటీలో నిలిచి గెలుపొందిన తర్వాత వారు కేవలం కుర్చీపై కూర్చొని సంతకాలు చేయడానికి, ఫోటోలకు మాత్రమే పరిమితమవు తున్నా రనేది అందరి నోటి వెంట వెలువడుతున్న విమర్శ. దీంతో సర్పంచ్ లుగా పేరుకే భార్య .. పాలించేది భర్త .. అనే చందంగా గ్రామాలలో పరిస్థితి నెలకొంది. అయితే ఇదే విధానం ప్రస్తుతం జడ్చర్ల మండలంలోనూ కొనసాగుతున్నట్లు వినికిడి.
ఇది పరిస్థితి..
మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికైన మహిళ సర్పంచుల స్థానంలో వారి భర్తలే అధికారాలను వినియోగిస్తూ ప్రజలు కూడా వారినే సర్పంచ్ అని పిలుస్తున్న పరిస్థితి కని పిస్తుందని స్థానికులే విమర్శిస్తున్నారు.మహిళలకు అధికారాలు ఇచ్చిన సమాజంలో ఉన్న పాత అభిప్రాయాలుమారకపోతే మహిళా నాయకత్వానికి పూర్తిస్థాయి గుర్తింపు రాదని చెబుతున్నారు.
ఇందులోనే మహిళా సర్పంచుల పాత్ర చాలా చోట్ల కుర్చీలపై కూర్చుంటూ సంతకాలకు, ఫోటోలకే పరిమి తం అవుతుందని విమర్శలు వినిపిస్తున్నా యి. గ్రామ అభివృద్ధి నిర్ణయాలు అధికారులతో మాట ముచ్చట్లు కూడా చాలా సంద ర్భాల్లో సర్పంచ్ భర్తలతోనే జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అదేవిధం గా మహిళా వార్డు సభ్యుల పరిస్థితి కూడా చాలా చోట్ల ఇదే విధంగా ఉందని అంటున్నారు.వార్డు సభ్యుల స్థానంలో వారి భర్తలే వ్యవహా రాలు చూసే పరిస్థితి నెలకొందని స్థానికంగా బలంగా వినిపిస్తుంది.
పేరుకే మహిళా సర్పంచ్‌లు.. పెత్తనం భర్తలది
మండలంలో 44 గ్రామపంచాయతీలకు 22 మంది మహిళా సర్పంచులు ఎన్నికైనారు. అయితే ఈ 22 చోట్ల మహిళా సర్పం చ్ ల పాత్ర అంతంతాగానే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఆ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారం భోత్సవం లాంటి కార్యక్రమాలో చాలా చోట్ల సర్పంచ్ భర్తలది హవా కనిపిస్తుంది. అధికారులు ఆ కార్యక్రమంలో ఉన్నప్పటికీ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో ఫోటోలు దిగడం సహజమనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ ఫోటోలు చూసిన ప్రజలు ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.మహిళలకు ఇచ్చిన హక్కులు నిజంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యావంతులు, సామాజికవేత్తలు కోరు తున్నారు. మహిళలు స్వయంగా బాధ్యతలు చేపట్టి నాయకత్వం వహించే పరిస్థితి రావాలంటే ప్రజల్లో కూడా అవగాహన పెరగా ల్సిన అవసరం ఉందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో జరిగే గ్రామసభలో కూడా భర్తలే పెత్తనం చెలాయిస్తూ పనులపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజలకు సమస్య లలో గ్రామంలో ఉన్న ప్రజలను మండల ఆఫీస్ కు తీసుకువచ్చి పలనా సర్పంచ్ భర్త ను సార్ అంటూ దబాయిస్తూ అధికారులను సైతం బెదిరిస్తున్న దాఖలాలు నెలకొ నడం విశేషం.
సర్పంచ్‌లు మహిళలు అయితే భర్తలు పెత్తనం చెలాయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
మహిళలు సర్పంచ్ లు ఎన్నికైన గ్రామలో అన్ని పదవి బాధ్యతలు ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించాలని ఎంపీడీవో విజయ్ కుమార్ వెల్లడించారు. గ్రామంలో కార్యక్రమాల్లో ఇతర వ్యవహారాల్లో భర్తలు జోక్యం చేసుకో వద్దని అలాంటి సమాచారం తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటం.
విజయ్ కుమార్,
ఎంపీడీవో, జడ్చర్ల






