30 May, 2026 | 1:49 AM

మహిళలు ఆర్థికంగా ఎదిగి కుటుంబ అభివృద్ధికి తోడ్పడాలి

30-05-2026 12:00 AM

అలంపూర్ మే 29: మహిళల ఆర్థిక సాధికారత , స్వయం ఉపాధి ప్రోత్సాహానికి ప్రభుత్వం ఇస్తున్న రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు.ఈ సందర్భంగా శుక్రవారం అలంపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని 14 మహిళ స్వయం సహాయక సంఘాలకు రూ. రెండు కోట్ల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ  కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ...మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదిగి కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతున్నారని కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, ప్రోత్సాహక పథకాలను సద్వినియోగం చేసుకొని చిన్న వ్యాపారాలు, ఉపాధి అవకాశాలను విస్తరించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జయ రాములు, వైస్ చైర్మన్ విక్రమ్, కమీషనర్ చంద్రశేఖర్, కౌన్సిలర్ మోహన్ రెడ్డి, నారాయణ రెడ్డి ,సుదర్శన్ గౌడ్, శేఖర్ రెడ్డి, మహిళా సంఘాల సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

రూ.60 లక్షలతో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి భూమి పూజ 

అలంపూర్ పట్టణంలో రూ.60 లక్షలతో చేపట్టిన డంపింగ్ యార్డ్ నిర్మాణానికి  ఎమ్మెల్యే విజయుడు భూమి పూజ చేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సూచించారు.