15 April, 2026 | 12:43 AM

తాగునీటి ఇబ్బందులు తీర్చాలని రోడ్డెక్కిన మహిళలు

14-06-2025 05:07 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy Districtమహమ్మద్ నగర్ మండల కేంద్రంలో వారం రోజులుగా బుడగ జంగాల కాలనీ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. శనివారం తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మహిళలు బోధన్​-హైదరాబాద్​ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. దీంతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై శివకుమార్  సంఘటనా స్థలానికి చేరుకొని మహిళలను సముదాయించారు. పంచాయతీ అధికారులతో మాట్లాడి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.