16 March, 2026 | 8:49 AM

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యం

16-03-2026 12:00 AM

రొయ్యూరు సర్పంచు కావిరి అర్జున్

ఏటూరునాగారం, మార్చి15 (విజయక్రాంతి): గ్రామాలలో పరిశుభ్రమైన వాతావ రణాన్ని కల్పించడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని రొయ్యూర్ సర్పంచ్ కావిరి అర్జున్ అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూర్ గ్రామపంచాయతీలో ఆదివారం పారిశుధ్య కార్మికులను శా లువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సర్పంచు కావిరి అర్జున్ మాట్లాడుతూ గ్రామం పరిశుభ్రంగా ఉండేందుకు పారిశుధ్య కార్మికులు నిరంతరం కష్టపడుతున్నారని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే నిజమైన సేవకులు పారిశుధ్య కార్మికులేనని, పరిశుభ్రత కోసం వారు చేస్తున్న సేవలు బాగు న్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.