16 April, 2026 | 12:02 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

మహిళల భద్రతయే.. మా మొదటి ప్రాధాన్యత

29-05-2025 06:15 PM

నిర్మల్ (విజయక్రాంతి): మహిళల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రక్షణ కల్పిస్తుందని షీ టీం ఎస్ఐ నర్సయ్య(She Team SI Narsayya) తెలిపారు. గురువారం పట్టణంలోని నారాయణ స్కూల్ లో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు మహిళల విద్యార్థుల భద్రతపై అవగాహన కల్పించారు. పోక్సో చట్టాల మీద,  చైల్డ్ మ్యారేజ్, జువెనైల్ చట్టాల మీద గంజా గస్తి ప్రోగ్రామ్ గురించి టీచర్స్ కి అవగాహన కల్పించి, వాళ్ళు పిల్లలకు అవగాహన కల్పించే విధంగా షీ టీం ఎస్ఐ నర్సయ్య అవగాహన కల్పించడం జరిగింది. నిర్మల్ లో గంజా పూర్తిగా రూపుమపడానికి ప్రతి ఒక్క టీచర్ తమవంతు సహకారం చేస్తూ సమాచారం ఉన్న లేదా  తమ వద్ద చదువుకునే పిల్లల నడవిడక అనుమానాస్పదంగా ఉంటే వెంటనే 8712659599 అనే నంబర్ కి సమాచారం అందించగలరని అని తెల్పినారు. ఇట్టి కార్యక్రమంలో నర్సయ్య ఎస్ఐ, షి టీం సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సుమారు 60 మంది ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.