8 April, 2026 | 1:34 PM

ఉద్యమం పెట్టిన పేరు!

23-02-2025 12:00 AM

నిర్మల్ జిల్లా.. వైద్య విభాగంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు షేక్ షరీపోద్దిన్. ఈయన చిన్నతనం నుంచి పాటలు, నృత్యాలు పోరాటాలపై ఆసక్తి చూపించేది. ఉమ్మది ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రాంతానికి చెందిన షరిపోద్దిన్.. ఉద్యోగరీత్యా 30 ఏళ్ళ క్రితం నిర్మల్‌కు వచ్చారు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో భోథ్  ప్రాంతంలో ఎక్కడ సభలు, సమావేశాలు జరిగిన అక్కడికి వెళ్ళి కాళ్లకు గజ్జలు కట్టి.. భుజంపై గొంగడి వేసుకొని తెలంగాణ పాటలు పాడేవారు. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం ఉద్యోగంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా వివిధ పీహెచ్‌సీలలో విధులు నిర్వహించారు. 

వందకు పైగా ప్రదర్శనలు..

2003 నుంచి కేసీఆర్, ప్రజా గాయకుడు స్వర్గీయ ప్రజా నౌక గద్దర్, విమలక్క, గోరెటి వెంకన్న, రసమయి బాలకిషన్.. వంటి తెలంగాణ సాంస్కృతిక కళాకారులు తెలంగాణ కోసం ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ధూంధాంలు కార్యక్రమాలు చేపట్టిన అక్కడికి వెళ్ళి ప్రత్యేక వేశధారణతో, పాటలు పాడి ప్రజలను చైతన్యం పరిచేవారు. నృత్యాలు చేస్తూ.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు వివరించి ‘ఆంధ్ర గో బ్యాక్’ అంటూ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఉదయం నుంచి సాయంత్రందాక పీహెచ్‌సీలో విధులు నిర్వహించి.. సాయంత్రం, ప్రభుత్వం సెలవు దినాల్లో ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ధూంధాం కార్యక్రమంలో పాల్గొనేవారు.

అలా 2011  తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు షేక్ షరీపోద్దిన్ ఉద్యోగం కంటే ఉద్యమం ముఖ్యం అంటూ ప్రభుత్వ విధులకు సెలవులు పెట్టి ఉమ్మడి జిల్లాలో స్థానిక కళాకారులను పోగు చేసుకుని.. ఊరూరా.. ధూంధాం కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రముఖ పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ఇంటి కంటే ఉద్యమ ద్యాస ఎక్కువగా ఉండడంతో  ఎక్కడా ధూంధాంలు జరిగిన షరీపోధ్దిన్‌కు ఆహ్వానం అందేది.

ఉద్యోగంలో ఇబ్బందులు పెట్టిన.. కేసులు పెట్టిన.. ఆయన వెనక్కి తగ్గలేదు. రాష్ట్ర జేఏసి కోదండరామ్  పిలుపు మేరకు ఉద్యమంలో ముందుండి పాటలు పాడారు. 100 వరకు ప్రదర్శనలు ఇచ్చారు. ఉద్యమంలో ఆయన అనేక సార్లు అరెస్టులు చేశారు. సకల జనుల సమ్మె, సాగరహారం, రైల్ రోకోల్లో పాల్గొన్నారు.

- నిర్మల్, విజయక్రాంతి

ఇంటి పేరు మార్పు.. 

ఉమ్మడి  జిల్లాలో తెలంగాణ  ఉద్యమంలో నృత్య కళాకారుడిగా ధూంధాం కార్యక్రమాలను నిర్వహిస్తున్న షేక్ షరీఫోద్దిన్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఇంటి పేరు మారి పోయింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు ఆంధ్రపాలకుల పెత్తనం, ఆంధ్ర ఉద్యోగులు గో బ్యాక్ అంటూ పదర్శనలు ఇవ్వడంతో షరీపోద్ద్దిన్ అందరి దృష్టిని ఆకర్శించారు. కళాకారులు ఎక్కడికి వెళ్ళిన ఈయనను అక్కడికి తీసుకెళ్లేది.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తునే ఉద్యమంలో ధోతి కట్టి భుజంపై గొంగడి వేసి.. కాలికి గజ్జలు కట్టి.. చేతిలో కర్ర పట్టుకుని.. పాటలు పాడుతూ ఊర్రూతలూ  ఊగించే వారు. అప్పటి నుంచి షేక్ షరిపోద్దిన్ అని పిలువకుండా తెలంగాణ షరీఫ్ అని పిలవాలని ప్రజల సమక్షంలో ప్రకటించారు. అప్పటి నుంచి తెలంగాణ షరీఫ్‌గా పిలుస్తున్నారు. ఇప్పటికి ఆయన ఎక్కడికి  వెళ్ళిన తెలంగాణ షరీఫ్ వచ్చిండు అంటు గౌరవం ఇస్తున్నారు. గద్దర్ తనకు ఆ పేరు  పెట్టడం వల్లనే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడిగా మంచి గుర్తింపు వచ్చిందని ఆయన చెబుతుంటారు.