26 June, 2026 | 1:46 AM

ఎంఎస్‌ఎన్ పరిశ్రమలో కార్మికుడు మృతి

26-06-2026 12:00 AM

శంకరంపేట్ /చేగుంట జూన్ 25, చిన్న శంకరంపేట్ మండలం, చందంపేట్ పరిదిలోని ఎంఎస్‌ఎన్ పరిశ్రమలో ఘనపూర్ మండలం, బ్యాతోల్  తిమ్మాయిపల్లి గ్రామానికి  చెందిన ఆవుసుల బ్రహ్మం (50) పరి శ్రమలో ఫిల్టర్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు, రోజు మాదిరిగా గురువారం రోజు ఉద యం 6 గంటలకు డ్యూటీ కి వచ్చి విధులు నిర్వహిస్తుండగా  అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చింది, వెంటనే అంబులెన్స్ లో చేగుంటలోని గణేష్ ఆస్పత్రికి తరలించారు,

అప్పటికే చనిపోయినట్లు డాక్టర్ లు ధ్రువీకరించారు, విషయం తెలుసుకున్న కుటుంబీకులు పరిశ్రమ వద్ద వచ్చి ఆందోళనకు దిగారు, వెం టనే సమాచారం అందుకున్న శంకరంపేట ఎస్ ఐ శివానంద్, ఇరు వర్గాలతో మాట్లాడి శాంతింప చేశారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు తెలిపారు, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలు కలిగించారు.