కారు ఢీకొని యువకుడి మృతి
26-06-2026 12:00 AM
చేర్యాల, జూన్ 25: చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామానికి చెందిన చిగుళ్ల వంశీ (25) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏపి10బిఏ5692 గల బైక్ పై వ్యవసాయం కోసం సన్నరకం వడ్లు కొనుగోలు కోసం చేర్యాల పట్టణానికి వచ్చి తిరిగి ముస్త్యాలకు వెళుతుండగా మార్గమధ్యలో చేర్యాల కోర్టు ఎదురుగా టీజీ 24 సీ 0018 గల కారు అతివేగంగా వెనుక నుండి ఢీ కొట్టి దూసుకెల్లడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి కొన్నాళ్ల క్రితం అప్పుల బాధతో మృతి చెందాడు. మృతునికి తల్లి, భార్య ఉన్నారు. సంఘటనా స్థలా నికి చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.






