కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సీఐటీయూ మండల కార్యదర్శి నరేష్
మేడ్చల్ అర్బన్, మే 29(విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మేడ్చల్ మండల సిఐటియు కార్యదర్శి ఎం నరేష్ మున్సిపల్ కమిషనర్ కృష్ణా రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు ఈనెల ఇవ్వాల్సిన జీతాలను ఇప్పటివరకు ఇవ్వకపోవడం వల్ల కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి వెంటనే జీతాలు చెల్లించాలని కోరినట్లు ఆయన చెప్పారు.
అంతే కాకుండా మున్సిపల్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బట్టలు, చెప్పులు, సబ్బులు, సరుపులు, నూనె, గ్లౌజులు, చీపురు కట్టలు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించకపోవడం బాధాకరమని నరేష్ తెలియజేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ను కోరినట్లు ఆయన స్పష్టం చేశారు.ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్మికుల జీతాలను రెండు రోజుల్లో వారికి అందజేస్తామని వాళ్లకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలను 15 రోజులలో పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని నరేష్ తెలియజేశారు..






