కార్మికులు ఆందోళన చెందొద్దు
జలమండలి కాంగార్ యూనియన్ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి
ముషీరాబాద్, జూలై 18(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల ప్రజలకు స్వచ్ఛమైన త్రాగు నీరు, మురుగు శుద్ధి పనులు చేస్తున్న క్రింది స్థాయి ఉద్యోగులు ఓటి కంపెన్సేషన్ నిలుపుదల విషయంపై ఎవరు ఆందోళన చెందవద్దని, ఓటి కంపెన్సేషన్ నిలుపుదల చేయలేదని ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి అన్నారు. ఓటి చేసిన కార్మికులకు గతంలో మాదిరిగా కంపెన్సేషన్ ఇప్పించబడుతుందని తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్‌లో ఆయన మీడియా తో మాట్లాడుతూ రాంబాబు యాదవ్ వం టి నకిలీ కార్మిక నేతలు ఓటి కంపెన్సేషన్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కార్మికులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసారు. కొంత మంది అత్యవసర విభాగం కార్మికులు 8 గంటలకు బదులుగా 12 గంటలతో పాటు సెలవు దినాలలో ఓటి పని చేస్తున్నారని, వారికీ తప్ప కుండ కంపెన్సేషన్ ఇప్పించబ డుతుందని తెలిపారు. అధికారులు తిరస్కరించినచో కాంగార్ యూనియన్ దృష్టికి తీసుకరావాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక పక్షపాతి అని, కార్మికులకు అన్యా యం జరిగితే సహించరని గుర్తు చేసారు.
ఓటి చేస్తున్న కార్మికుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని లేబర్ యాక్ట్ ప్రకారం శాఖపరమైన ఉత్తర్వులు జలమండలి ఎండి కె. అశోక్ రెడ్డి జారీచేశారని, ఈ విషయమై ఆయనతో చేర్చించామని, కార్మికులు ఓటి చేస్తే తప్పకుండ కంపెన్సేషన్ వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీస్తూ అసత్య ప్రచారాలు చేస్తే ఉరుకునేదిలేదని, తాటతీస్తామని అయన బిఆర్‌ఎస్ నేతలను హెచ్చరించారు.






