19-07-2025 02:03:31 AM
హైదరాబాద్, జూలై 18 : తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన బోనాల పండుగను పురస్కరించుకుని ముసీరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బోనాల ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ సిబ్బంది తలపై బోనమేత్తి ఆలయానికి శోభాయాత్రగా వెళ్లారు. ఈ వేడుకల్లో స్టాప్ నర్సుల, ల్యాబ్ సిబ్బంది, ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని సంప్రదాయబద్ధంగా వేడుకలను జరిపారు.
మంగళ వాయిద్యాలతో, బతుకమ్మ పాటలతో ప్రాంతమంతా మేళతాళాలతో మారుమోగింది. ప్రాంగణాన్ని పూలతో అలంకరించి, ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో పిహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్కుమార్ రెడ్డి పాల్గొని మహిలకు బొనమెత్తారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోనం మోసే మహిమ, సంప్రదా య సంస్కృతి పరిరక్షణకు చిహ్నం‘ అని వారు వ్యాఖ్యానించారు. ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో నిర్వహించిన శోభాయాత్రలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.