దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్
రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి
జాజిరెడ్డిగూడెం,(అర్వపల్లి): రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో అంబేద్కర్ అధ్యయన వేదిక,పీపుల్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కోఆర్డినేటర్, తిమ్మాపురం గ్రామం మాజీ సర్పంచ్ జీడి వీరస్వామి మాట్లాడుతూ... వివక్షా రహిత సమాజానికి సమానత్వం కోసం వర్గకుల మత లింగ బేధాలు లేకుండా భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపే దిశగా కృషి చేసిన మహా దార్షనికుడు అంబేద్కర్ అని కొనియాడారు.
అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ -3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని,దేశ ఫెడరల్ వ్యవస్థ బలోపేతానికి అంబేద్కర్ చేసిన కృషి మహోన్నతమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ రైతుసంఘం మండల కార్యదర్శి ఎల్లెంల అవిలయ్య,యూత్ అధ్యక్షులు జీడి సైదులు, నాగరాజు, వివిధ ప్రజా సంఘాలు, పార్టీల నాయకులు, నల్లగుంట్ల నాగేందర్, గుడిపెల్లి వెంకటరెడ్డి, కందుల తిరుమలరావు, కొనతం వెంకటరెడ్డి, జీడి శ్రవణ్, కర్ణాకర్, రవీందర్, వెంకన్న, సుధాకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






