నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు
వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
హనుమకొండ, జూన్ 1 (విజయక్రాంతి): విధి నిర్వహణలో వృత్తి నిబద్ధతతో పనిచేస్తే శాఖపరమైన గుర్తింపుతో పాటు రివార్డులు వస్తాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సిబ్బంది సూచించారు. వరంగల్ కమిషనరేట్ కార్యాలయములో పోలీస్ సిబ్బంది శాఖపరమైన సమస్యలపై పోలీస్ అధికారులు ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమఃలో వరంగల్ పోలీస్ కమిషనర్ సిబ్బందితో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ముందుగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నీజాయితోతో పనిచే యాలని, శిక్షణ సమయంలో నేర్చుకున్నదే కొనసాగించాలని, ప్రభుత్వం అంటే ముం దుగా గుర్తుకు వచ్చేది పోలీసులని, కావున పోలీసులు చేసే ప్రతి పని ప్రజలు గమనిస్తారని, అదే విధంగా ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం అధికంగా వుందని. దీని కారణంగా పోలీసులు తప్పు చేసిన, చేయకున్న సోషల్ మీడియా ద్వారా పోలీసుల వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందని. ఇది దృష్టిలో వుంచుకోని ప్రతి పోలీస్ అధికారి జాగ్రత్తగా పనిచేయాలని. నిరంతరం కష్టపడి విధులు నిర్వర్తించడమే కాకుండా చేసే విధులను క్రమశిక్షణతో నిర్వహించాలని లేకుంటే ప్రజల్లో పోలీసుల పట్ల తప్పుడు సంకేతాలు పోతాయని,మీకు ఎదైన శాఖపరమైన లేక వ్యక్తిగత సమస్యలు వుంటే తన దృష్టి రావాలని, వీలైనంత వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తానని పోలీస్ కమిషనర్ తెలిపారు.
అనంతం ఖైదీల ఎస్కాట్, ఇంక్రీమెంట్లు, విశ్రాంతి గదులుతో పాటు పలు శాఖపరమైన సమస్యలు పోలీస్ సిబ్బంది పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుక వెళ్ళారు. ఈ సమావేశంలో అదనపు డిసిపిలు రవి, సురేష్కు మార్, శ్రీనివాస్,ఏసిపి నాగయ్య, అంత య్య, సురేంద్ర, పరిపాలధికారి సంపత్ కుమార్ ఆర్.ఐలు సర్పర్జన్ రాజ్, సతీష్, శ్రీధర్, చంద్రశేకర్, సూపరింటెండెంట్లు యాకుబ్ బాబా, సంధ్య, వహిద్ పాషా, గిరితో పాటు ఆర్.ఎస్.ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.






