2 June, 2026 | 2:19 AM

ఐఐటీ ఫలితాలలో కాకతీయ ప్రభంజనం

02-06-2026 01:47 AM

అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు

నిజామాబాద్, జూన్ 1(విజయక్రాంతి): సోమవారం ప్రకటించిన 2026 ఐఐటీ అడ్వాన్స్‌డ్ ఫలితాలలో నిజామాబాద్ కాకతీయ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాల ప్రతి భను కనబరిచారని, ఇంటర్మీడియట్, జేఈ ఈ మెయిన్స్, ఈఏపీసెట్, పాటు ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో కూడా కాకతీయ విద్యార్థులు అందరికంటే ముందున్నారని కాకతీయ కళాశాల చైర్‌పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి అన్నా రు.

కాకతీయ విద్యార్థులు 2026 ఐఐటీ అడ్వాన్స్‌డ్ ఆల్ ఇండియా ర్యాంకులు సా ధించిన ఫలితాల వివరాలు.. హెచ్.భరత్ 1275వ ర్యాంక్, జె.తన్విత 1573, బి.సంధ్య 1627, ఆర్.బన్నీ 1834, ఏ.ఆత్రిజ్ 2361 ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు(ఐఐటీఐఏఎన్) మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రకటించిన 2026 ఐఐటీ అడ్వాన్స్‌డ్ ఫలితాలలో అత్యుత్తమ ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి తమ విద్యార్థులు నిజామాబాద్ స్థాయిలోనే కాకుండా, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటారని అన్నారు.

కాగా వివిధ కేటగిరిలలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన కాకతీయ విద్యార్థులను డైరెక్టర్ సీహెచ్ తేజశ్విని అభినందించారు. ఇంతటి అద్భుతమైన ఫలితాలకు కారకులైన కాకతీయ విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు. విశేషమైన కృషినందించిన ఉపాధ్యాయ బృందానికి, ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు, సిబ్బందికి చైర్‌పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి, మ్యాథ్స్ డైరెక్టర్ సీహెచ్ రాజా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాకతీయ కళాశాలల ప్రిన్సిపాల్స్ సందీప్ కుల కర్ణి, వి.రణధీశ్ శర్మ, అకాడెమిక్ కోఆర్డినేటర్ నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్యాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.