30 June, 2026 | 2:55 PM

Breaking News

ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

06-06-2025 12:47 AM

ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ 

శేరిలింగంపల్లి, జూన్ 5:ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీ లో శేరిలింగంపల్లి జిహెచ్‌ఎంసి డీసీ ప్రశాంతి, కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి మొక్కలు నాటారు పిఎసి చైర్మన్ ఆరెకపూడి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్డెన్ తులిప్ కాలనీ లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం చాలా సంతోషకరమైన విషయంఅని, ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలిచారని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో కనీసం ఒక్క మొక్క నాటి, పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగస్వాములు కావాలని కోరారు.

భవిష్యత్ తరాల కోసం శుభ్రమైన, స్వచ్ఛమైన ఆహ్లదకరమైన వాతావరణాన్ని అందించాలంటే పర్యావరణ పరిరక్షణ ఎంతో అవసరమని తెలియచేసారు. భూమి మీద నివసించే ప్రతి జీవికి మొక్కలే జీవనాధారమని,పర్యవరణాన్ని కాపాడుకుంటేఅది మనల్ని కాపాడుతుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఏఏంహెచ్‌ఓ శ్రీకాంత్ రెడ్డి ఎస్‌ఆర్పి భరత్, విద్యాసాగర్ రెడ్డి,కాలనీ వాసులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలోపాల్గొన్నారు.