6 June, 2026 | 1:44 AM

హైడ్రా ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

06-06-2026 12:00 AM
  1. చెరువులతో నగరానికి జీవకళ తెద్దాం
  2. ప్రకృతిని పరిరక్షించుకుందాం హైడ్రా ప్రచారం
  3. ముఖ్యమైన కూడళ్లలో ప్లకార్డులను ప్రదర్శించిన హైడ్రా

సికింద్రాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): గొలుసుకట్టు చెరువులను కాపాడుకుందాం.. చెరువులతో నగరానికి జీవకళ తీసుకువద్దాం.. ప్రకృతిని పరిరక్షిద్దాం.. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యమౌదాం అంటూ నగరంలో హైడ్రా నినదించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నగరంలోని పలు ముఖ్యమైన కూడళ్లు, క్రీడామైదానాలు వద్ద ప్రకృతి పరిరక్షణపై చైతన్య కార్యక్రమాన్నిహైడ్రా చేపట్టింది.

ట్రాఫిక్ పోలీసులు, ఐటీ ఉద్యోగులు, చిన్నారులు, నగర ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై భవిష్యత్ నగరానికి బాటలు వేశారు. మన చెరువులు మన భవిష్యత్.., హైడ్రాతో కలసి చెరువులను పరిరక్షించుకుందాం, సేవ్ వాటర్ సేవ్ లైఫ్, పర్యావరణంతో మెరుగైన జీవితం అంటూ నినదించారు. సికింద్రాబాద్,కర్బలా జంక్షన్, అమీర్పేటలోని మైత్రివనం జంక్షన్, బాలాపూర్ చౌరస్తా,ఆరాంఘర్ చౌరస్తా, ఎల్.బి.నగర్, హైటెక్సిటీ, గోల్కొండ, రాజేంద్రనగర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో హైడ్రా ఆర్ ఎఫ్వో జయప్రకాష్,డీఆర్‌ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు, వాహనదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత ః బీజేపీ మోడీ గవర్నెన్స్ అభియాన్ కన్వీనర్ బిజ్జి కనకేష్ కుమార్ 

ముషీరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): నగరంలో పేరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు నాటాలని బీజేపీ మోదీ గవర్నెన్స్ అభియాన్ కన్వీనర్ బిజ్జి కనకేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఈ కృష్ణ, నందగిరి నర్సింహ, నిత్యానంద్, డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శులు బబ్లూ, శివకుమార్, నాయకులు సత్యనారాయణ, నాగేందర్, ఉపెందర్ తదితరులు పాల్గొన్నారు.

ముషీరాబాద్‌లో...

ముషీరాబాద్ డివిజన్ లోని కళాధర్ నగర్ కాలని అధ్యక్షుడు మెట్టు వాసు ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు మొక్కలు నాటారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముషీరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, పార్టీ నాయకులు బిజ్జి రవి, నాగరాజు, ప్రజ్ఞనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌బీ నగర్‌లో..

ఎల్బీనగర్, జూన్ 5 : మొక్కలు నాటి, సంరక్షించి, పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితోపాటు వివిధ పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా శుక్రవారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.  దిల్ సుఖ్ నగర్ నుంచి కొత్తపేట వరకు బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సైకిల్ మీద ప్రయాణిస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ...  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని,ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో గడ్డి అన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, నాయకులు సత్యంచారి, గండి సన్నీ యాదవ్, రవిముదిరాజ్, గండికోట శ్రీనాథ్, ముద్ద కళ్యాణ్, ప్రదీప, సదానంద్ రెడ్డి, రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాహన కాలుష్యాన్ని తగ్గిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే సందేశంతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మెట్రో రైల్లో ప్రయాణించారు.

ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతును తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ లింగోజిగూడ డివిజన్ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం మాజీ ధర్మకర్త మధుసాగర్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నందనవనంలోని హనుమాన్ దేవస్థానంలో బీజేపీ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు ఎరుకల మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎల్బీనగర్ ఇన్చార్జి, మేడ్చల్ జిల్లా రూరల్ ఇన్చార్జి సామ రంగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. 

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొగ్గుల మాధవ రెడ్డి, గజ్జల రాజ్ గౌడ్, గౌని వెంకటేష్ గౌడ్, విజయ్ శ్రీ, జీవన్ రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి, నీల, గోవర్ధన్ యాదవ్, మల్లేశ్ యాదవ్, బాలరాజు, శివకుమార్, సోమిరెడ్డి, సునీల్ నాయక్, లక్ష్మీకాంత్ రెడ్డి, శ్రీకాంత్, భాను ప్రకాశ్, అరవింద్ పాల్గొన్నారు. 

మన్సూరాబాద్ చెరువు వద్ద ‘మాకి నాంపే ఏక్ పెడ్’ 

 మన్సూరాబాద్ డివిజన్ పెద్ద చెరువులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ఏక్. పేడ్ మా కే నామ్‘ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్  కొప్పుల నర్సింహరెడ్డి తదితరులు పాల్గొని, మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, నాయకులు రాజేంద్ర ప్రసాద్, మోరిశెట్టి సంతోష్, బుచ్చిరెడ్డి విష్ణువర్ధన్,  మునగాల హరీశ్ రెడ్డి, మల్లు మంగారెడ్డి, నందికొండ గీతారెడ్డి, నరేశ్ యాదవ్, ఎడ్ల అమ్రేష్ ముదిరాజ్, కేశిరెడ్డి పద్మారెడ్డి, పోరెడ్డి కవితా రెడ్డి, నాగిరెడ్డి, దామోదర్ గౌడ్, సాయిరామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.