5 August, 2026 | 7:48 PM

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆహ్వాన పత్రిక, కరపత్రం విడుదల

05-08-2026 06:41 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 2026 నిర్వహణలో భాగంగా ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి  మంద మకరందు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో గోడపత్రికలను  విడుదల చేశారు. బుధవారం ఈ సందర్భంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికతో పాటు కరపత్రాన్ని కూడా అధికారికంగా విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొని, ఆగస్టు 9న ఉట్నూర్‌లో కేపీ కాంప్లెక్స్లో నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ మహాసభను విజయవంతం చేయాలని ఆదివాసీ ప్రజలకు పిఓ మంద మకరందు పిలుపునిచ్చారు. ఆదివాసీ హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సమాజ ఐక్యత కోసం అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ నిర్వహణ కమిటీ  చైర్మన్  టేకం భీంరావు, మంగం విషం రావు, రాజ్ గోండు సేవ సమితి వెడ్మ కొద్దు పటేల్, గిరిజన నాయకులు పాల్గొన్నారు.