5 August, 2026 | 7:34 PM

గంజాయి విక్రయ స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు

05-08-2026 06:43 PM

 ఒకరి అరెస్టు

 కిలోన్నర గంజాయి స్వాధీనం

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం గౌతపూర్ తబ్రీజ్ పాలిసింగ్ స్టోన్ ఫ్యాక్టరీ వద్ద గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతడి వద్ద నుండి దాదాపు కిలోన్నర ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా మధ్య నిషేధ, అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

బీహార్ రాష్ట్రానికి చెందిన కతిహార్ జిల్లా  బైరియా గ్రామానికి చెందిన మహమ్మద్ ముక్తకిం అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు  ఆయన తెలిపారు. ఈ దాడుల్లో తాండూర్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ రాణి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.