14 August, 2026 | 9:40 AM

పవన్ కు Y ప్లస్ సెక్యూరిటీ.. రేపే ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు

18-06-2024 12:09 PM

అమరావతి : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేఖ విమానంలో విజయవాడ వచ్చిన ఆయనకు జనసేన నాయకులు, అభిమానులు ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా.. ఆయనకు ప్రభుత్వం భద్రత పెంచింది.

Y ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పవన్ వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లి తన ఛాంబర్ ను పరిశీలించనున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా సచివాలయానికి వస్తున్నారు. అమరావతి వస్తున్న పవన్ కు రాజధాని రైతులు స్వాగతం పలకనున్నారు. రేపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.