నీట్ పరీక్షపై రాజ్ భవన్ ను ముట్టడించిన బీఆర్ఎస్వీ
హైదరాబాద్ : నీట్ ప్రశ్న పత్రం లీకేజ్ కు నిరసనగా పలు విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో పలు విద్యార్థి సంఘాలు నారాయణగూడ నుంచి ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశాయి. ఇదిలా ఉండగా.. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాజ్ భవన్ ముట్టడించింది. రాజ్ భవన్ ఎదుట ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు, అనుంబంధ సంఘాలు నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... నీట్ పరీక్షను రద్దు చేసి సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సం.జయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.






