14 August, 2026 | 10:40 AM

యాదాద్రిలో వైభవంగా 'గిరి ప్రదక్షిణ'

18-06-2024 11:35 AM

యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దివ్య క్షేత్రంలో వైభవంగా గిరి ప్రదక్షిణ జరిగింది. స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్ని గిరి ప్రదక్షిణం చేశారు. వైకుంఠ ద్వారం వద్ద ప్రభుత్వ విప్, ఆలేరు ఎంఎల్ఎ బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం 2 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ ఉంగా రాష్ట్రంలో ఈ సేవను ప్రారంభించిన తొలి ఆలయంగా యాదాద్రియే నిలిచింది.