28 July, 2026 | 2:02 PM

Breaking News

ఎరువుల కొరతపై బీఆర్‌ఎస్ ఆందోళన ,హెచ్చరిక   •   రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •  

‘అపరిచితుడు’ కాన్సెప్ట్‌తో యముడు

15-11-2024 12:00 AM

జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’. జగన్నాథ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉప శీర్షిక. శ్రావణి శెట్టి హీరోయిన్‌గా, ఆకాష్ చల్లా రెండో హీరోగా నటిస్తున్నారు. ఈ థ్రిల్లర్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

కాగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి గురువారం విడుదల చేశారు. హీరో, దర్శకుడు నిర్మాత జగదీష్ మాట్లాడుతూ.. “సామాన్య ధర్మం పాటించకుండా సమాజానికి కీడు చేసే వాళ్లకు యముడు ప్రత్యక్షమై గరుడ పురాణం ప్రకారం శిక్షలు వేస్తుంటాడు. యముడు ఎందుకు ఆలా చేస్తాడు, చివరికి ఏమవుతుందనేదే మా చిత్ర కథ.

‘అపరిచితుడు’ కాన్సెప్ట్‌లోనే ఉంటుందీ సినిమా” అని తెలిపారు. ఈ చిత్రానికి డీవోపీ: విష్ణురెడ్డి వంగా; సంగీతం: భవాని రాకేశ్; యాక్షన్: రామ్ సుంకర; డాన్స్: రాజ్ పైడి; జగదీష్ ఆమంచి; స్క్రీన్ ప్లే: శివ కూండ్రపు.