ఎవర్ని వదలి పెట్టను.. అధికారంలో ఎవరున్నా భయపడను
హైదరాబాద్: కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తాటాకు చప్పుళ్ళకు తాను భయపడేది లేదని వైసీపి ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం విశాఖపట్నంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తే లేదన్నారు. ఐదు సంవత్సరాల తర్వాత వైసిపి అధికారంలోకి రావడం ఖాయమని, తోక ఆడించే వారి తోకలను తాము వచ్చిన తర్వాత కత్తిరిస్తామని హెచ్చరించారు.
నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలనని, ఒక ఆదివాసి మహిళా అధికారిని అవమానించి, ఆమెతో నాకు సంబంధం అంటగట్టి ఎటువంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారని ఆయన ఆరోపించారు. అసత్య కథనాలు ప్రసారం చేసిన వారితో క్షమాపణలు చెప్పిస్తా అని సవాలు చేశారు. తాను చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగాను. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే వ్యక్తిని కాదన్నారు.రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, వంశీ కృష్ణలాంటి వ్యక్తిని కాదన్నారు. అన్ని హక్కుల కమిషన్‌లకు ఫిర్యాదు చేస్తామని,మహాన్యూస్ వంశీ కృష్ణను వదలను పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశ పెడతా, ప్రివిలేజ్ మోషన్‌తో మూవ్ చేస్తా అని వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి హెచ్చరించారు.




