8 June, 2026 | 1:47 AM

ఐటీ కారిడార్ ముద్దు.. డంపింగ్ యార్డు వద్దు

08-06-2026 12:00 AM

సిద్దాపూర్లో బీఆర్‌ఎస్ వంటావార్పు నిరసన

కొత్తూరు, జూన్ 7(విజయక్రాంతి) మం డలంలోని సిద్దాపూర్లో ప్రతిపాదిత డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వినూత్నంగా ’వంటావార్పు’ నిరసన చేపట్టారు. స్థానికులు ప్రతి ఇంటి నుండి బియ్యం తెచ్చి, యార్డుకు ప్రతిపాదించిన స్థలంలోనే వంటలు చేసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు ఎమ్మె సత్యనారాయణ మాట్లాడుతూ..

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం యువత ఉద్యోగాల కోసం ఐటీ పార్క్ ఏర్పాటుకు కేటాయించిన భూమిలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాభిప్రాయం లేకుండా డం పింగ్ యార్డు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. చుట్టుపక్కల 30 గ్రామాల ప్రజల ఆ రోగ్యాలను దృష్టిలో ఉంచుకుని, ప్రాణా లు పణంగా పెట్టైనా డంపింగ్ యార్డును అడ్డుకుంటామని హెచ్చరించారు. పార్టీలకతీతం గా ప్రజలు, యువత ఈ ఉద్యమంలో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, బాలయ్య, కడల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.