యోగ ఆరోగ్యానికి.. సమైక్యతకు జాతీయ జెండా..
బీఆర్ఎస్ మండలాద్యక్షులు దొంగరి యుగేందర్..
పెన్ పహాడ్: సంపూర్ణ ఆరోగ్యానికి యోగ ఎంతో.. దేశ సమైక్యతకు జాతీయ జెండా దిక్సూచిగా నిలిచిందని బిఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్(BRS Mandal President Dongri Yugandhar) అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సూర్యాపేట జిల్లా పెంపహాడ్ మండలం దోస పహాడ్ గ్రామంలో యుపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆయన పాల్గొని మాట్లాడారు. యోగ శరీరం మనసు ఆరోగ్యంగా ఉండేలా యోగ మార్గం చూపిస్తుందని అన్నారు.
యోగ వ్యాయామం కాదని ఆరోగ్యానికి మనసుకు ప్రశాంతతను ఇచ్చే మార్గమన్నారు. కాగా 100 మీటర్ల జాతీయ జెండాతో యోగ ప్రాముఖ్యత, భారతదేశ పటిమపై అవగాహన కల్పిస్తూ వీధి వీధిన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరసయ్య పి ఆర్ టి ఓ రాష్ట్ర నాయకులు మామిడి వెంకటయ్య, మాజీ సర్పంచ్ శ్రీరాములు, దొంగరి సుధాకర్, ఉపాధ్యాయులు అంగన్వాడీలు గ్రామస్తులు పాల్గొన్నారు.






