24 August, 2026 | 9:53 PM

Breaking News

చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •   ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం   •   చిలుకూరును డైరీ హబ్ గా తీర్చిదిద్దాలి   •   గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది   •   ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి   •   డ్రైవర్ కుటుంబానికి తోటి డ్రైవర్ల ఆర్థిక చేయూత   •   విద్యార్థులు కమ్యూనికేషన్, ఏఐ స్కిల్స్ పెంపొందించుకోవాలి   •  

యోగా పురాతన ఆధ్యాత్మిక అభ్యాసం

21-06-2025 12:39 PM

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): యోగా అనేది పురాతన ఆధ్యాత్మిక అభ్యాసం మని యోగా చేయడం ద్వారా మనసు,శరీరాన్ని ఏక దాటిపై తీసుకొని రావచ్చని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Sharath Chandra Pawar) అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కారించుకొని ఆర్ట్ ఆఫ్ లివింగ్  ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో మిషన్ పరివర్తన్ యాంటీ డ్రగ్ వారోత్సవాలలో భాగంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా పోలీసు ఉద్యోగంలో యోగా ధ్యానం అనేది చాలా అవసరం 24 గంటలు విధినిర్వహణలో అనేక సమస్యలు ఎదురవుతాయని అలాంటపుడు మానసిక ప్రశాంతత కొరకు ప్రతి రోజు ఈ యోగా,ధ్యానం చేయడం ద్వారా ఆందోళన,వత్తిడి తగ్గి శరీరంలో నూతన ఉత్తేజాన్ని నింపుటకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు ఆర్.ఐలు, ఎస్.ఐలు  సిబ్బంది పాల్గొన్నారు.