28 June, 2026 | 2:13 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

గిన్నిస్ రికార్డు సాధించిన యోగాంధ్ర కార్యక్రమం

21-06-2025 08:45 AM

విశాఖపట్నం: యోగాంద్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు(Guinness record) సాధించింది. యోగాంధ్ర కార్యక్రమంలో 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. సూరత్ యోగా రికార్డును విశాఖ యోగాంధ్ర అధిగమించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ వేదికైంది. 'యోగా ఫర్ వన్ ఎర్త్- వన్ హెల్త్' నినాదంతో ఈ కార్యక్రమం  చేపట్టారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగాసనాలు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సమసక్షంలో యోగాంధ్ర గిన్నిస్ రికార్డు సాధించింది. 45 నిమిషాల పాటు మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ యోగాసనాలు వేశారు.

నేవీ సిబ్బంది సముద్రంలో యోగాసనాలు(Yogasanas) వేసింది. 9 యుద్ధనౌకలు, 2 కోస్ట్‌గార్డ్‌ నౌకలపై నేవీ సిబ్బంది యోగాసనాలు వేసి అకట్టుకున్నారు. విశాఖలో ఘనంగా యోగాంధ్ర వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆర్కే బీచ్‌లో యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు యోగాడే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.  ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సహా ప్రముఖులు హాజరైన బిగ్‌ ఈవెంట్‌ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రులు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.