calender_icon.png 14 July, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగి బుల్డోజర్ అటాక్.. చెరసాలకు చంగూర్‌బాబా!

14-07-2025 02:45:51 AM

  1. అమాయక హిందూ అమ్మాయిలే టార్గెట్
  2. బలవంతంగా మతమార్పిడులు..
  3. విదేశాల నుంచి భారీగా అక్రమ నిధులు
  4. మూడేండ్లలో ఇస్లామిక్ దేశాల నుంచి రూ.500కోట్లు
  5. యూపీలో బురిడీ బాబా అరాచకాలు
  6. జమాలుద్దీన్ అలియాస్ చంగూర్‌బాబా, అతడి అనుచరుల అరెస్టు

న్యూఢిల్లీ, జూలై 13: ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా అలియాస్ పీర్ బాబా అలియాస్ హజీ జ మాలుద్దీన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జూలై 5న ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ స్వాడ్ (ఏటీఎస్) చం గూర్ బాబాతో పాటు అతని సహచరురాలు నీతూ రోహ్రాను లక్నోలో అరెస్ట్ చేసింది. ఈ దొంగ బాబా అసలు పేరు కరీముల్లా షా అని పోలీసులు తెలిపారు. 

హిందూ యువతులను ట్రాప్ చేసేందుకు 1000 మంది ముస్లిం యువకులను బాబా పురమాయించినట్టు పలువురు పేర్కొంటున్నారు. అంతే కాకుండా అమాయకులను మతమార్పిడు లు చేయించినట్టు కూడా తేలింది. ఇందుకోసం చంగూర్ బాబాకు మిడిల్ ఈస్ట్‌లోని అనేక ఇస్లాం దేశాల నుంచి భారీగా నిధులు వచ్చినట్టు అధికారులు గుర్తించారు.

విదేశాల నుంచి వచ్చే నిధుల ద్వారా చంగూర్ బాబా దేశంలో మతమార్పిడులకు పాల్పడుతున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా గుర్తించింది. గతంలో సైకిల్ తొక్కుకుంటూ ఊరూరా తిరుగుతూ ఉంగరాలు, తాయిత్తులు అమ్ముకునే బాబా ప్రస్తుతం రూ. 100 కోట్ల వరకు సంపాదించినట్టు అధికారులు గుర్తించారు. చంగూర్ బాబాకు మొత్తం 30 బ్యాంకుల్లో ఖాతాలున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు.

కేవలం ఇవి మాత్రమే కాకుండా ఇంకో 18 ఖాతాలు కూడా ఉన్నట్టు తేలింది. ఈ ఖాతాల్లో రూ. 68 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. ఈ ఖాతాలకు గత మూడు నెలల్లోనే మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి రూ. 7 కోట్లు, గడిచిన మూడు సంవత్సరాల్లో దాదాపు రూ. 500 కోట్ల వరకు నిధులు వచ్చినట్టు తేలింది.

చంగూర్ బాబాకు భారత్‌లోనే కాకుండా నేపాల్‌లో కూడా బ్యాంకు ఖాతాలున్నట్టు అధికారులు గుర్తించారు. మరీ ముఖ్యంగా పాక్, సౌదీ అరేబియా, తుర్కియే, యూఏఈల నుంచి భారీగా నిధులు వచ్చినట్టు తేలింది. ఈ డబ్బును ఆశగా చూపి పేదలను మతమార్పిడులకు ప్రోత్సహించారని తేలింది. జాతి ఆధారంగా రేట్లు నిర్ణయించి యువతులను మతమార్పిడులకు ప్రోత్సహించినట్టు సమాచారం. 

దిమ్మతిరిగేలా కోడ్ వర్డ్స్

చంగూర్ బాబా హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు పలు కోడ్ నేమ్స్ వాడినట్టు తేలింది. ప్రోత్సాహకాలు, ఆర్థిక సాయం, వివాహ హామీలు, బలవంతంగా బెదిరించడంతో అనేక మందిని ఆకర్షించారు. ఇందుకోసం పలు రకాల కోడ్స్‌ను బాబా ఆయన అనుచరవర్గం వాడింది. ప్రాజెక్ట్ అంటే మహిళ అని.. మిట్టి పలట్నా (మట్టి మార్చడం) అంటే మతమార్పిడి అని..

కాజల్ లగానా అంటే మహిళల్ని ముగ్గులోకి దించడం అని.. దర్శన్ అంటే సదరు అమ్మాయిని బాబాకు పరిచయం చేయడం అని తేలింది. బాబా, ఆయన అనుచరులు వాడిన కోడ్ పదాలు, వాటి అర్థాలను ఉత్తర్‌ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) వెల్లడించింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్‌ఐఏ, ఈడీలు కూడా తమ దర్యాప్తును ప్రారంభించాయి. 

చంగూర్ బాబా నిర్మాణాలపైకి బుల్డోజర్

ఒకప్పుడు సైకిల్‌పై తిరిగే చంగూర్ బాబా భారీగా ఆస్తులను కూడబెట్టాడు. బలరాంపూర్‌లో ఉన్న చంగూర్ బాబాకు చెందిన భారీ విల్లాను యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీఎస్) స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న అనంతరం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్మాణాలపైకి బుల్డోజర్‌ను పంపింది.

ఈ నిర్మాణంలో ఉన్న కొన్ని గదులను ఆ బుల్డోజర్లు కూల్చేశాయి. భవనంతో పాటు కీలకపత్రాలను ఏటీఎస్ బృందం సంపాదించింది. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఇండో నేపాల్ సరిహద్దు గుండా యూపీలోని ఏడు జిల్లాల ద్వారా నిధులు అందేవని గుర్తించారు. చంగూర్ బాబా గత 15 ఏండ్లుగా ఈ మతమార్పిడి రాకెట్‌ను వివిధ రూపాల్లో నిర్వహిస్తున్నట్టు యూపీ ఏడీజీ లా అండ్ ఆర్డర్ అమితాబ్ యశ్ పేర్కొన్నారు. 

కులాన్ని బట్టి రేటు..

ఎన్నో అవకతవకలకు పాల్పడుతున్న చంగూర్ బాబాను అతడి సహాయకురాలు నీతు అలియాస్ న స్రీన్‌ను ఈ నెల ఐదున అరెస్ట్ చేశా రు. బ్రాహ్మణ, క్షత్రియ, సిక్కు యువతులు మతం మారితే రూ. 15 నుంచి 16 లక్షలు, బీసీ యువతులు మతం మారితే రూ. 10 లక్షలు, ఇతరులకు రూ. 8 లక్షలు ఇచ్చినట్టు అ ధికారులు గుర్తించారు. 

ఏడు రోజుల కస్టడీకి.. 

చంగూర్ బాబాతో పాటు అరెస్ట్ చేసిన నీతు అలియాస్ నస్రీన్‌కు కోర్టు ఏడు రోజుల ఏటీఎస్ కస్టడీని విధించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సంస్థలు కూడా విచారిస్తున్నాయి. చంగూర్ బాబాకు రూ. 5 కోట్ల విలువైన 40 గదుల బంగ్లా బలరాంపూర్‌లో ఉండగా.. యూపీ గవర్నమెంట్ 10 బుల్డోజర్లతో మూడు రోజుల పాటు కూల్చివేతలు చేపట్టింది. ఈ బంగ్లాను ప్రభుత్వ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారు.