calender_icon.png 14 July, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైకును ఢీకొన్న వాహనం.. వ్యక్తి స్పాట్ డెడ్

14-07-2025 08:36:48 AM

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాలానగర్(Balanagar) వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకుపై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. వ్యక్తి హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.