14-07-2025 01:39:08 AM
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సూర్యాపేట జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాలో ని తుంగతుర్తి నియోజకవర్గంలో ప లు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలో సాయం త్రం జరిగే బహిరంగ సభలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కొత్త రేషన్‌కార్డులను పం పిణీ చేయనున్నారు.
ఈ మేరకు పౌరసరఫరాలశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,58,187 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు, తద్వారా 11,11,223 మందికి లబ్ధి కలుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. పాత కార్డుల్లో 4,41,851 కొత్త సభ్యులను చేరుస్తున్నారు. దీంతో మొత్తం 15,53,074 మందికి రేషన్ ప్రయోజనం కలుగుతుంది.
మొదటి దశగా నారాయణపేట జిల్లాలో గతంలో నిర్వహించిన సభ ద్వారా 2,03156 కొత్త కార్డులు మంజూరు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా రేషన్‌కార్డులు ఇవ్వలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం పెద్దఎత్తున రేషన్‌కార్డులు పంపిణీ చేస్తోందని కాంగ్రెస్ నతలు చెబుతున్నారు. కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని తెలిపారు.