17-02-2026 02:10:15 AM
కరీంనగర్, ఫిబ్రవరి 16 (విజయ క్రాంతి): కరీంనగర్ నుంచే కాంగ్రెస్ పత నం మొదలైందని, 6 గ్యారంటీలను అమ లు చేసేదాకా వదలబోమని కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. సోమవారం కరీంనగర్‌లో మున్సిపల్ కార్పొరేష న్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కార్పొరేటర్లతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
కరీంనగర్ కార్పొరే షన్‌లో బీజేపీ గెలిచినా రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వాల్సిందేనని అన్నారు. కార్పొరేషన్‌లో బీజేపీ విజయం సాధించిందని.. ని ధుల మంజూరు విషయంలో రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఆయ న హెచ్చరించారు. కేంద్రం నుంచి తాను నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి గారు.. మెజారిటీ సీట్లను సాధించిన బీజేపీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవి దక్కకుండా మంత్రులు, బీఆర్‌ఎస్, ఎంఐఎంతో కలిసి మీరు చేయ ని కుట్రలు లేవు. అయినా నా రాజకీయం ముందు, బీజేపీ సైనికుల పోరాట పటిమ ముందు మీ కుట్రలన్నీ పటాపంచలైనయ్.
అధికారం చేతిలో ఉంది కదా అని బీజేపీ 30 సీట్లు సాధించినా, ఇండిపెండెంట్లు మావైపు ఉన్నా మమ్మల్ని ఓడించేందుకు కుట్రలు జరిగాయి. క్రికెట్‌లో ఇండియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించినట్లుగానే, కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల కబడ్డీ ఆటలో మీ అందరినీ ఓడించి బీజేపీ కప్ గెలుచుకుంది. ఈ వేదికగా ఇప్పుడు చెపుతున్నా మీరు అనవసరంగా, అప్రజా స్వామికంగా నన్ను కెలికి ఆట మొదలుపెట్టారు.
ఇక మీ ఆటకు నేను ముగింపు ఇస్తా. యుద్ధం ఇప్పుడే మొదలైంది. అంతి మ విజయం కూడా మాదే’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటి కావ డానికి కారణమేంటని ప్రశ్నించారు. మీ చీకటి ఒప్పందాలేమిటని ప్రశ్నించారు. కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ను ఎగరేయాలని ఎన్నో ఏళ్లుగా కల కన్నామని, ప్రజలంతా ఎదురు చూశారని, ఆ కల సాకారమైనందుకు సంతోషంగా ఉన్నదన్నారు.
కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమ లు చేసేదాకా మెడలు వంచుతామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పతనానికి ముగింపు పలుకుతామని, అందుకు కరీంనగరే వేదిక కాబోతోందన్నారు. గత రెండ్రోజులుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం కుట్రలను చూసి మేం భయపడలేదని, కనీస వ్యూహం, ఎత్తుగడలకు లేకుండా వ్యవహరించిన తీరును చూసి తామంతా నవ్వు కున్నామన్నారు.
కరీంనగర్ మేయర్ ఎన్ని క విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పూర్తిగా సహకరించారని, వారికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహకారం మరువలేనిదన్నారు. వీరితోపాటు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణసహా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎంతో సహకారం అందించారని తెలిపారు.