17-02-2026 02:05:48 AM
డీఎస్‌ఈకు డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): డిప్యూటీ ఈవో, డీఎస్సీ, మోడల్ స్కూల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు రావుల రామ్మోహన్ రెడ్డి, దుర్గం హరీష్, శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే 3 సార్లు టెట్ పరీక్షలు పూర్తి చేసినందున రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లు, మోడల్ స్కూల్స్‌లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు, డైట్ లెక్చరర్ పోస్టులకు, డిప్యూటి ఈవో పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు బడిబాట, ప్రాథమిక పాఠశాలల బలోపేతంపై మరిన్ని సంస్కరణలు చేయాలని ఉపాద్యాయ విద్యార్థి రేషియోని సవరించాలని తదితర అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు వారు పేర్కొన్నారు.