10-02-2026 02:17:03 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగి సే వరకూ అప్రమత్తంగా ఉండాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పోలింగ్ ప్రారంభం కావడానికి ఉన్న 24 గంటలూ కీలకమని, ప్రతి ఓటర్ ను పోలింగ్‌కు తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సీఎం అన్నారు.
సోమ వారం మంత్రులతో సీఎం జూమ్ సమావేశం నిర్వహించగా, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమా ర్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్ వరకు అనుసరించే వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతు లపైన ఆరా తీశారు. బలహీనంగా ఉన్న మున్సిపాలిటీల్లో అనుసరించే వ్యూహాలపై చర్చించారు. స్థానిక నేతల నేతృత్వంలో పోల్ మేనేజ్‌మెంట్ జరిగేలా చూడాలని మంత్రులకు సీఎం సూచించారు.
సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నా యని, అయినప్పటికీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లకు అందుబాటులో ఉం డాలని సూచించారు. ఎక్కడైనా అసమ్మతి, రెబ ల్స్ సమస్య ఉంటే వెంటనే పరిష్కరించి, కేడర్‌ను ఏకతాటిపైకి తీసుకురావాలని సూచించారు. గాంధీభవన్‌లో ఉన్న వార్ రూమ్‌కు సమస్య చెబితే పరిష్కారం దొరుకుతుందన్నారు.
ప్రభు త్వం అమలు చేస్తున్న గ్యారెంటీలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో మంత్రులు పోషించిన పాత్రపై సీఎం సమీక్షించారు. అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని, ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు రిపీట్ కావాలన్నారు.