24 August, 2026 | 1:37 PM

పెండింగ్‎లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్‎ను వెంటనే విడుదల చేయాలి

24-08-2026 12:30 PM

కామారెడ్డి, ఆగస్ట్ 24 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని విద్యా సంవత్సరాలుగా విద్యార్థులకు బాకీ ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ బాకీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు చేపడుతున్న 48గంటల నిరహార దీక్షకు మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో నిరసన చేపట్టినట్లు తెలిపారు.

కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జి లతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గత బి ఆర్ ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు  విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని అన్నారు, పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, ప్రభుత్వానికి కాలేజీలకు మధ్య విద్యార్థుల భవిష్యత్తు నలిగిపోతుంది అని అన్నారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఉద్యమం ఉదృతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ గుప్తా, కుంటా లక్ష్మారెడ్డి, రాజు పాటిల్, కౌన్సిలర్లు, బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.