28 July, 2026 | 1:59 AM

అబిడ్స్ పరిధిలో యువకుడు హల్‌చల్

28-07-2026 01:16 AM

డ్రగ్స్ మత్తులో పోలీసులపైకే కారు నడిపిన నిందితుడు

రంగారెడ్డి, జులై 27(విజయక్రాంతి): నగరంలోని అబిడ్స్ పరిధిలో అర్ధరాత్రి వేళ ఓ యువకుడు విచ్చలవిడిగా ప్రవర్తించి తీవ్ర అలజడి సృష్టించాడు. డ్రగ్స్ మత్తులో తూ లుతూ వాహనం నడుపుతున్న ఆ యువకుడిని తనిఖీ చేసేందుకు పోలీసులు యత్నిం చగా, అతడు ఆగకుండా ఏకంగా వారిపైకే కారును దూకించాడు.ఈ ఘటనలో పలువురు సిబ్బందికి తృటిలో ప్రమాదం తప్పి నట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని ఛేజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

అతడు పక్కాగా మత్తు పదార్థాలు సేవించినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో, కఠిన చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. కాగా  నగరంలోని ఐటీ కారిడార్ (మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం) ప్రాంతాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షా లు, పీక్ అవర్స్ సమయంలో ఒకేసారి వేలా ది వాహనాలు రోడ్లపైకి రావడం వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఐటీ కంపెనీల యాజమాన్యాలకు పోలీసులు ముందస్తు లాగౌట్ ఇవ్వాలని అడ్వైజరీ జారీ చేశారు. ఉద్యోగులను విడతల వారీగా ఇళ్లకు పంపితే రోడ్లపై ఒత్తిడి తగ్గుతుందన్నారు.