calender_icon.png 4 July, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లి చేసుకున్న ఆనందం తీరకముందే యువకుని మృతి

18-03-2025 10:32:30 PM

కామారెడ్డి (విజయక్రాంతి): పెళ్లి చేసుకున్న ఆనందం తీరకముందే ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువు గుంతలో పడి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ కు చెందిన కడమంచి రాములు 26 అనే యువకుడు గత 15 రోజుల క్రితం పెళ్లి చేసుకొని ఆనందంగా గడపాలనుకున్నాడు. ఆ యువకుడిని విధి బలి తీసుకుంది. కట్టుకున్న భార్యతో మనసు తీరా మాట్లాడకముందే చెరువు రూపంలో మృత్యువు కబళించింది.

వివాహం జరిగిన పక్షం రోజులకే యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సదాశివనగర్ గ్రామానికి చెందిన కడమంచి రాములు (26) కూలీ పనులు చేసుకొని జీవిస్తాడు. 15 రోజుల క్రితమే అతడికి వివాహం అయింది. మంగళవారం ఉదయం గ్రామ శివారులో గల పాత చెరువులో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన రాములు కాలుజారి చెరువులో పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను బయటకు తీశారు. అయితే అప్పటికే రాములు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.