1 March, 2026 | 8:22 PM

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

01-03-2026 06:37 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో ఆదివారం హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ఇందిరమ్మ ఇల్లు పెయింటింగ్ పనులు చేస్తుండగా 11 కేవీ విద్యుత్ లైన్‌కు తగలడంతో మహ్మద్ అజీజ్ (35), జమలొద్దీన్ కుమారుడు, కామారెడ్డి నివాసి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో జరిగింది.

మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, ఆరుగురు అక్కచెల్లెల్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న భిక్కనూర్ ఎస్ఐడి ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ లైన్ల సమీపంలో పనులు చేసే సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.